BJP MP | వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఓ బీజేపీ ఎంపీ (BJP MP)కి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్థానికుల దాడిలో సదరు ఎంపీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని మాల్దాహా (Maldaha) లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ ఖాగెన్ ముర్ము (Khagen Murmu) సోమవారం మధ్యాహ్నం వరద ప్రభావిత జల్పైగురి (Jalpaiguri) ప్రాంతంలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి వరద బాధితులకు సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారిపై స్థానికులు కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఖాగెన్ ముర్ము తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. బీజేపీ నేతలు వెంటనే ఎంపీని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ నేతల పనే అని ఆరోపించింది.
Also Read..
CJI | షాకింగ్.. సీజేఐ గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. రెజ్లింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు.. VIDEO