విశాఖపట్టణం: భారతీయ నౌకాదళంలోకి కొత్త యుద్ధ నౌక చేరింది. యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఆండ్రోత్(Androth) ఇవాళ జలప్రవేశం చేసింది. విశాఖపట్టణం నావల్ డాక్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆ యుద్ధ నౌకను కమిషన్ చేశారు. ఆండ్రోత్ యుద్ధ నౌక ద్వారా యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ సామర్థ్యం పెరగనున్నట్లు నేవీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్, ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, ఇతర సీనియర్ నేవీ ఆఫీసర్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకను డెవలప్ చేశారు. కోల్‌కతాకు చెందిన కంపెనీ ఈ వెసల్‌ను స్వదేశీయంగా తయారు చేసింది. నౌకలోని 80 శాతం పరికరాలు దేశీయంగా తయారైనట్లు ప్రకటనలో చెప్పారు.
ఆండ్రోత్ యాంటీ సబ్‌మెరైన్ వెసల్‌లో అడ్వాన్స్డ్ వెపన్స్, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో దీన్ని నిర్మించారు. కనిపించని శత్రువులను గుర్తించి, ట్రాక్ చేసి, ఆ తర్వాత ఆ టార్గెట్‌ను నిర్వీర్యం చేస్తుంది. సముద్ర జలాల్లో నిఘా కోసం, గాలింపు, రెస్క్కూ కోసం కూడా ఈ యుద్ధ నౌకను వాడనున్నారు.
కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) కంపెనీ దీన్ని నిర్మించింది. ఆండ్రోత్తో నేవీకి చెందిన ఏఎస్‌డబ్ల్యూ సామర్థ్యం పెరగనున్నట్లు నేవీ పేర్కొన్నది. ఆర్నాలా, నిస్తార్, ఉదయగిరి, నీలగిరి యుద్ధ నౌకలను నేవీ కమిషన్ చేసిన విషయం తెలిసిందే.
Proud Moment For GRSE As Second ASW SWC INS Androth Gets Commissioned Into Navy
Kolkata/Visakhapatnam (October 6, 2025): It was yet another proud moment for Garden Reach Shipbuilders and Engineers (GRSE) Ltd on Monday, October 6, 2025, when INS Androth – second in a series of… pic.twitter.com/skHX7e7qUN
— GRSE – Garden Reach Shipbuilders & Engineers Ltd (@OfficialGRSE) October 6, 2025