జమ్మికుంట రూరల్ : మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన బిజేపీ కిసాన్‌మోర్చ జిల్లా నాయకుడు గూడూరి శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శ్రీనివాస రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం కోరపల్లి గ్రామానికి చెందిన ఆటో ట్రాలీ యూనియన్ నాయకులు, సభ్యులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.