
ముషీరాబాద్, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర బీజేపీ నాయకులు వరి ధాన్యం కొనుగోలు విషయంలో తలా ఒక మాట మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగాన్ని గందరగోళానికి గురిచేస్తూ ముంచుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. దేశంలో అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న తెలంగాణ రాష్ర్టానికి చేయూతనందించాల్సిన కేంద్రం రైతాంగాన్ని నిలువునా ముంచుతుందని ధ్వజమెత్తారు. వానాకాలం పంటను పూర్తిగా కొనుగోలు చేయని కేంద్రం యాసంగి పంట కొనబోమని చేతులెత్తేయడం కేంద్రం రైతు వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరి ధాన్యం కొనబోమని చెప్తుంటే బీజేపీ నాయకులు మాత్రం వరి ధాన్యం కొంటాం, వరి వేయండి అంటూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు బీజేపీ బచ్చగాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇక ముందు అలాగే వ్యవహరిస్తే టీఆర్ఎస్ శ్రేణులు తగిన బుద్ధి చెప్తామని హెచ్ఛరించారు.
నియోజకవర్గంలో నిరసన ప్రదర్శన..
తెలంగాణ రైత్యాంగం పండించిన వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ చావు డప్పుకొట్టి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్వర్యంలో నియోజకవర్గంలోని రాంనగర్ చౌరస్తా, గాంధీనగర్‌లలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలు ప్రదర్శించిన నేతలు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి.. పంజాబ్ కో న్యాయం తెలంగాణకు మరో న్యాయమా, రైతులపై విక్ష తగదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. చావుడప్పుకొట్టి రైతుల పట్ల మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల పట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిరసన తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభా గం నేత ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్లు బి.హేమలతారెడ్డి, ముఠా పద్మ, టీఆర్ఎస్ పార్టీ పలు డివిజన్ల అధ్యక్షులు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ఆర్.మోజస్, బి.శ్రీనివాస్‌రెడ్డి, రాకేశ్‌కుమార్, వల్లాల శ్యామ్యాదవ్, వై. శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నేతలు ముఠా నరేశ్, టీ సోమసుందర్, దామోదర్‌రెడ్డి, సురేందర్, నేత శ్రీనివాస్, శ్యామ్‌సుందర్, ఆకుల అరుణ్, శ్రీధర్‌రెడ్డి, అనూరాధ, గోవింద్, బింగి నవీన్, సయ్యద్ అస్లాం, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనాలి..
చిక్కడపల్లి, డిసెంబర్20 : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులు పండించిన ధన్యమంతా కొనాల్సిందే అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రైతులపై వివక్షకు నిరసనగా గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ వద్ద కేంద్రం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టం చేస్తుందని మండిపడ్డారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం. రాకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, ముఠా జైసింహ, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఆకుల శ్రీకాంత్, ఎర్రం శ్రీనివాస్‌గుప్తా, గడ్డమీది శ్రీనివాస్, సుధాకర్, శ్రీధర్‌రెడ్డి, కాంత్రిరెడ్డి, రవి శంకర్‌గుప్తా, హన్మంతు, గుడ్ల శ్రీనివాస్, ఎస్టీ ప్రేమ్, పాశం రవి, జి.వై. గిరి, చాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
ముషీరాబాద్, డిసెంబర్ 20: రాంనగర్ డివిజన్ క్రిష్ణానగర్ కమ్యూనిటీహాల్లో ఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్డీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జయసింహ, ఆర్. మోజస్ తదితరులు పాల్గొన్నారు.
అంకిత భావంతో పని చేసినప్పుడే గుర్తింపు
అంకిత భావంతో పని చేసినప్పుడే మంచి గుర్తింపు ఉంటుందని కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ అన్నారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహించిన 2012 బ్యాచ్‌కు చెందిన వి. లక్ష్మయ్య టాస్క్‌ఫోర్స్ డిపార్ట్మెంట్కు బదిలీ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయనను కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్, సంఘసేవకుడు లడ్డూయాదవ్, శ్రావణ్‌యాదవ్ సన్మానించారు.