బడంగ్‌పేట, అక్టోబర్ 29: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ బీజేపీ నాయకులు, తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న బీజేవైఎం నాయకులు మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పి.కార్తీక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవున్నాయన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాని తెలిపారు. పెండింగ్ పనులను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. మతం పేరుతో కులం పేరుతో ఓట్లు అడుగుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 24 గంటలు కరంట్ ఇస్తున్న కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఆశీర్వదించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజాల నాగేశ్, బాణావత్ మోతీలాల్, శ్రీను, లక్ష్మన్, శకంర్, కిరన్, నర్సింగ్, తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్.రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బొర్ర జగన్ రెడ్డి, దండు గణేశ్, వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, బాలు నాయక్, బుజ్జి తదితరలు ఉన్నారు.
మీర్‌పేట లెనిన్‌నగర్‌లో..
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్‌నగర్, చింతలకుంట, ప్రశాంత్‌నగర్‌లో బీఆర్ఎస్ నాయకులు దిండు భూపేశ్ గౌడ్, శ్రీను నాయక్, కో-ఆప్షన్ పల్లె జంగయ్య గౌడ్, కార్పొరేటర్ రవినాయక్, ప్రభాకర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ పార్టీ నుంచి విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. అభివృద్ధి చేస్తారు కారు గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.