పట్నా: నకిలీ పత్రాలతో ఏకంగా రైలు ఇంజిన్నే అమ్మేశాడు ఓ ప్రబుద్ధుడు. బీహార్‌లోని సమస్థిపూర్ రైల్వే డివిజన్లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న రాజీవ్ రంజన్ ఝా ఈ ఘనకార్యం చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించి పూర్ణియా కోర్టు స్టేషన్ వద్ద ఉన్న పాత స్టీమ్ ఇంజిన్‌ను సెక్యూరిటీ గార్డ్ సాయంతో ఈ నెల 14న విక్రయించాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంజినీర్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇంజినీర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.