
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 9 : భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్ అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు ఆయన సతీమణి, 13మంది సైనికులు మృతి చెందడంపై ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్ బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, జేపీఎన్సీఈ ప్రిన్సిపాళ్లు జీవన్‌కుమార్, చంద్రశేఖర్, అధ్యాపకులు రాఘవేందర్‌రెడ్డి, అజమతుల్లా, శ్రీను, రాజశేఖర్‌రెడ్డి, గోపాల్, అరీఫ్, ఆఫ్రీన్, జ్యోతి, నాగరాజు పాల్గొన్నా రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ముత్వాల ప్ర కాశ్, రంగారావు, ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్‌గౌడ్, అని త, సీజే బెనహర్, లక్ష్మణ్‌యాదవ్, సిరాజ్‌ఖాద్రీ, అబ్దుల్హ క్, సాయిబాబా, తాహెర్, రాములు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, డిసెంబర్ 9 : దేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, సైనిక అధికారుల మృతిపై జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాదేపల్లి ఉన్నత పాఠశాలల విద్యార్థులు సంతా పం వ్యక్తం చేశారు. ముందుగా బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్ అప్పీయచిన్నమ్మ, వైస్ ప్రిన్సిపాల్ రవీందర్రావు, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ యాదయ్య, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, నర్సింహ, నందకిశోర్, నాగరాజు, ఎన్సీసీ క్యాడెట్లు, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వివేకానంద, ఉపాధ్యాయులు గోవింద్‌నాయక్, అలీంపాషా, సునీల్‌కుమార్, ఎన్సీసీ అధికారి రఘు, కృష్ణయ్య, అరుణ, చంద్రకళ, మెర్సిఫ్రెంజ్, జియావుద్దీన్, భాగ్యమ్మ, శశిరేఖ, శ్రీనివాసులు, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 9 : హెలికాప్టర్ ప్ర మాదంలో మృతి చెందిన దేశ త్రివిధ దళపతి బిపిన్ రావత్, జవాన్లకు అడ్డాకుల, మూసాపేట మండలాల ప్రజలు, నా యకులు నివాళులర్పించారు. మూసాపేట, సంకలమద్ది ఆద ర్శ మహిళా సెంటర్, అడ్డాకులలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, శెట్టి శేఖర్, నాగిరెడ్డి, గట్టు మల్లేశ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, డిసెంబర్ 9 : మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వే సి నివాళులర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు పలువురు జవాన్లు మృతి చెందడంపై విచా రం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటయ్య, చరణ్, సుగ్నేశ్, సంధ్యారాణి, నాగమణి, అనిత, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, డిసెంబర్ 9 : మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌లో యువకులు బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తోపాటు 13మంది సైనికులు మృతి దేశానికి తీరనిలోటని తెలిపారు. కార్యక్రమంలో సదానంద్, రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆగిరి సత్యం, శ్రీను, శివరాజ్, ఫరూఖ్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, డిసెంబర్ 9 : హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీరయోధుడు బిపిన్ రావత్‌కు మండలంలోని కప్లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, డిసెంబర్ 9 : దేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అందించిన సేవలు మరువలేనివని సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెర్కివిడ్లో బిపిన్ రావత్, ఆయన సతీమణి మ ధూలిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, నారాయణగౌడ్ పాల్గొన్నారు.
దేశానికి తీరనిలోటు
రాజాపూర్, డిసెంబర్ 9 : హెలికాప్టర్ ప్రమాదంలో త్రి విధ దళాధిపతి బిపిన్ రావత్‌తోపాటు 13మంది సైనికుల మృతి దేశానికి తీరనిలోటని మాజీ సైనికుడు సయ్యద్‌అలీ, ఏబీవీపీ నాయకుడు బాలరాజు అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బిపిన్ రావత్, జవాన్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.