హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీకి అదనంగా హైదరాబాద్లో మరో బయో ఫార్మాస్యూటికల్ హబ్ ఏర్పాటు కానుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. లక్ష స్క్వేర్ ఫీట్లలో రెండు దశల్లో నిర్మాణం చేపడుతామని, మరో 15 నెలల్లో బీ-హబ్ బయో ఫార్మాస్పేస్ అందుబాటులోకి రాబోతుందంటూ ట్వీట్ చేశారు. టీఎస్ ఐఐటీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. బీ-హబ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు ప్రజలకు అందేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.
Happy to unveil glimpses of Biopharma Hub (B-hub), which is first-of-its-kind Growth-Phase Center and Biopharma Scale-up Manufacturing facility in India
— KTR (@KTRTRS) September 5, 2021
B-Hub will be operational in 15 months and will help consolidate Telangana’s leadership position in biopharma space pic.twitter.com/MYPXo3ZAJh