
ఇది చెరకు, బీట్రూట్లాంటి పంటల్లో నత్రజని జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇది నేరుగా మొక్కల వేర్లలోనే కాకుండా, మొక్కల పైభాగాన కూడా జీవించి, నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా ఎన్ఏఏ అనే హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
వాడే విధానం : ఒక ఎకరం చెరకు పంటకు 3కిలోల జీవ ఎరువును రెండు దఫాలుగా వాడాలి. ముచ్చెలు నాటే సమయంలో 1.5కిలోలు, మోకాలు లోతు పంట అయిన తర్వాత 1.5కిలోలు వంద కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి.