న్యూఢిల్లీ : పాక్షికంగా ప్రారంభమైన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ చార్జీలను ఫిబ్రవరి 15 నుంచి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ వే రోడ్లలో నిర్మాణం పూర్తి అయిన భాగానికి మాత్రమే టోల్ చెల్లించాలి. ఇది జాతీయ రహదారుల టోల్‌కు సమానంగా ఉంటుంది. గతంలో పాక్షికంగా కొంత భాగం మాత్రమే పూర్తయిన ఎక్స్ ప్రెస్వేలపై ప్రయాణించే వాహనాలకు 25 శాతం అధికంగా టోల్ వసూలు చేసేవారు.
ఎక్స్‌ప్రెస్ వే పూర్తి పరిధి మేరకు నిర్మాణం కాకపోయినా ఇంతే మొత్తంలో చార్జీలు వసూలు చేసేవారు. టోల్ తగ్గింపు ఏడాది కాలం పాటు లేదా సంబంధిత ఎక్స్‌ప్రెస్ వే పూర్తి పరిధి నిర్మాణం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఈ నిబంధనలో ఏది ముందుగా సంభవిస్తే అంత వరకు టోల్ తగ్గింపును అమలు చేస్తారు.