హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల (సీహెచ్‌సీ) వద్ద బొగ్గు రవాణా బిల్లుల జారీ ప్రక్రియను సరళతరం చేసేందుకు సింగరేణి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఎస్ఏపీ ద్వారా ఈ- ఇన్వాయిస్, ఈ-వే బిల్లులను జనరేట్‌చేసే ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్ 21న అన్ని సీహెచ్డీల వద్ద ఎస్ఏపీ ఇంటిగ్రేషన్‌తో బిల్లులను రూపొందించడం ప్రారంభించగా.. మంగళవారం సింగరేణిభవన్ నుంచి జీఎం (కో ఆర్డినేషన్) కే సూర్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో ఈ-ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి జీఎస్టీ పోర్టల్‌లో, ఈ వే బిల్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి ఉండేదని సూర్యనారాయణ తెలిపారు. కానీ ఇప్పుడు ప్రైజ్ వాటర్ కూపర్ సంస్థ ద్వారా ఎస్ఏపీ ఈ ఇన్వాయిస్ బిల్లుల జనరేషన్ సులభమైందని పేర్కొన్నారు.