Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 57వ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ డ్రామాతో నిండిపోయింది. ఎప్పటిలాగే ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆసక్తికరంగా సాగింది. టెడ్డీ బేర్లను సేఫ్ జోన్‌కి తీసుకెళ్లే రేసులో చివరగా చేరిన సభ్యులకు నామినేషన్ బాధ్యత ఇవ్వడం ద్వారా గేమ్‌లో కొత్త మలుపు తీసుకొచ్చారు. మొదటి రౌండ్లో సంజన నామినేట్ అయ్యారు. తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం హాట్‌టాపిక్‌గా మారింది. భరణి మాట్లాడుతూ – “తనూజ వల్ల నేనే హౌస్ నుంచి బయటకు వెళ్లాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదు” అని ఫైర్ అయ్యాడు.
దీనికి తనూజ కూడా బలమైన కౌంటర్ ఇచ్చి వాతావరణం మరింత వేడెక్కించింది. చివరికి సంచాలకురాలిగా ఉన్న దివ్య .. భరణిని నామినేట్ చేయడం హౌస్‌లో హీట్ పెంచింది. టాస్క్ ముగిసిన తర్వాత భరణి ..తనూజ, దివ్యల దగ్గరికి వెళ్లి “ఇకపై నా గురించి మాట్లాడకండి. మీ గేమ్ మీరు ఆడుకోండి” అంటూ తన బంధం పూర్తిగా ముగిసిందని స్పష్టంగా చెప్పేశాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ కూడా తనూజపై ఫైర్ అయ్యాడు. “తనూజ సేఫ్ గేమ్ ఆడుతోంది” అని ఆరోపించాడు. అయితే ఈసారి కూడా సంచాలకులు తనూజని నామినేట్ చేయలేదు. చివర్లో బిగ్ బాస్ కెప్టెన్ దివ్యకు ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఇప్పటివరకు నామినేట్ కానివారిలో ఒకరిని ఆమె నామినేట్ చేయాలి అని ఆదేశించారు. దాంతో దివ్య తనూజ పేరు చెప్పింది.
తనూజ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటుంది అని దివ్య కామెంట్ చేసంది. తన నిర్ణయానికి కారణం చెబుతూ .. తనూజ ప్రతి టాస్క్‌లో సింపతీ కోసం చూస్తుంది. ఓటమిని అంగీకరించలేక ఏడుస్తూ కూర్చుంటుంది అని విమర్శించింది దివ్య. ఇక 57వ రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనూజ ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. మొత్తంగా 57వ రోజు నామినేషన్స్ ఎపిసోడ్లో టాస్క్, గొడవలు, భావోద్వేగాలతో హౌస్‌లో హీటు పెరిగిపోయింది. ఇక వీక్షకుల ఓట్లు ఎవరి వైపునకు మొగ్గుతాయో చూడాలి