ఇటీవలే యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరో రవితేజ. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్‌ని తీర్చిదిద్దారు.
నాయకానాయికలు రవితేజ, అషికా రంగనాథ్‌లపై ఈ గీతాన్ని తెరకెక్కిస్తున్నామని, శేఖర్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చుతున్నారని, హుషారెత్తించే మాస్ నంబర్‌గా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. చాలా విరామం తర్వాత రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, కుటుంబ భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా మెప్పిస్తాయని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.