మహానటి సావిత్రి జీవితకథంతా సంఘర్షణే.. బాలీవుడ్ మహానటి మీనాకూమారి జీవితంలోనూ అంతటి సంఘర్షణ దాగుందన్న విషయం చాలామందికి తెలీదు. సావిత్రి కథలా మీనాకుమారి కథ కూడా విషాదాంతం. నక్షత్రమండలం నుంచి నేల రాలిన ధృవతారగా, ట్రాజెడీ క్వీన్‌గా మీనాకుమారిని అభివర్ణిస్తుంటారు ఉత్తరాది ప్రేక్షకులు. త్వరలోనే ఆమె కథ తెరకెక్కనున్నది. సిద్ధార్థ్ సి.మల్హోత్రా రూపొందించనున్న ఈ చిత్రానికి ‘కమల్ ఔర్ మీనా’ అనే పేరును కూడా ఖరారు చేశారు.
ఇందులో మీనాకుమారిగా ఎవరు నటిస్తారు? అనే విషయంలో మాత్రం మొన్నటివరకూ స్పష్టత లేదు. తొలుత కృతి సనన్ పేరు బాగా వినిపించింది. తర్వాత కియారా అద్వానీ పేరు వెలుగులోకి వచ్చింది. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై నటి కైరా అద్వానీ క్లారిటీ ఇచ్చారు.
‘కమల్ ఔర్ మీనా’లో తానే మీనాకుమారి పాత్ర పోషిస్తున్నట్టు ఆమె అధికారికంగా వెల్లడించారు. మీనాకుమార్ భర్త కమల్ పాత్ర ఎవరు పోషిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. స్టోరీతో సహా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నది.