Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మరి కొద్ది రోజులలో ఫినాలే ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా జరుపుకోనుంది. ప్రారంభంలో నిదానంగా నడిచిన ఈ రియాలిటీ షో, ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత అసలు రంగు చూపిస్తోంది.శుక్రవారం ప్రసారమైన 75వ ఎపిసోడ్లో హౌజ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కెప్టెన్సీ టాస్క్ సమయంలో తనూజ–దివ్య మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరి, మాటల యుద్ధం వ్యక్తిగత వ్యాఖ్యల వరకూ వెళ్లింది. ఇది చూసి ప్రేక్షకులు కూడా షాకవుతున్నారు. ఫ్యామిలీ వీక్ ముగిసిన అనంతరం బిగ్ బాస్ కొత్త కెప్టెన్సీ టాస్క్ ప్రకటించాడు.
టాస్క్‌లో భాగంగా ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న తనూజను తప్పించాలని దివ్య సూచించింది. తన పేరునే టార్గెట్ చేస్తున్నావంటూ తనూజ మండిపడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుస్తూ వాతావరణాన్ని హీటెక్కించారు.“పిచ్చి పిచ్చిగా మాట్లాడకు” అని దివ్య హెచ్చరించగా, “నీ బిహేవియర్ అంతే” అని తనూజ కౌంటర్ ఇచ్చింది. వాదన తీవ్ర స్థాయికి చేరడంతో దివ్య–తనూజలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకుంటూ కంట్రోల్ తప్పారు. ఈ క్రమంలో తనూజ .. “బయట సరిపోక లోపలికి వచ్చావ్” అని అనగా, దివ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కామెంట్‌తో హౌజ్ వాతావరణం వేడెక్కిపోయింది.
ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకున్నారు, “నీకు అందరు కావాలి, అందరు నీ మాటే వినాలి” అంటూ దివ్య చేసిన కామెంట్ హౌజ్‌ని మరింత రచ్చ రచ్చగా మార్చింది. కొందరు కంటెస్టెంట్లు పరిస్థితి అదుపు చేయకపోతే ఎలా ఉండేదో అనే అనుమానాలు కూడా ప్రేక్షకులలో కలిగాయి. ఇక ఉద్రిక్త వాతావరణం మధ్య కెప్టెన్సీ టాస్క్ కొనసాగింది. మొదటి రౌండ్లో తనూజ ఎలిమినేట్ కాగా, రెడ్ టీమ్ (ఇమ్మాన్యుయెల్, సంజనా, భరణి, దివ్య) – బ్లూ టీమ్ (కళ్యాణ్, రీతూ, డీమన్ పవన్, సుమన్ శెట్టి) మధ్య పోటీ జరిగింది. చివరగా రీతూ చౌదరీ, సుమన్ శెట్టి ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు.ఫైనల్ టాస్క్‌లో రీతూ చౌదరీ విజయం సాధించి ఈ వారం కెప్టెన్‌గా ఎంపికైంది. కెప్టెన్సీ గెలిచిన రీతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరంలో తేలిపోయింది. సీజన్ ముగింపు సమీపిస్తున్న కొద్దీ కంటెస్టెంట్ల మధ్య ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారం జరిగిన ఘర్షణ, కెప్టెన్సీ టాస్క్ టెన్షన్ బిగ్ బాస్ హౌజ్‌ని హీట్ మోడ్‌లోకి తీసుకు వెళ్లిందనే చెప్పాలి.