Bigg Boss 9 | బుల్లితెర ప్రతిష్టాత్మక రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ఈ రోజు నుంచి (సెప్టెంబర్ 7) ప్రారంభం కానుంది. ఈ సారి “డబుల్ హౌస్ – డబుల్ ఎంటర్టైన్మెంట్” అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేసిన షో టీమ్, హౌస్‌లోకి అడుగు పెట్టబోయే 14 కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్టు సమాచారం.తొలి రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే షో కొనసాగుతూ ఉండగా, మెల్లిమెల్లిగా ఈ సంఖ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా పెరగనుంది. ఆ వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడవుతాయి.
ఈసారి బిగ్ బాస్ సీజన్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. సామాన్యులు, సెలబ్రిటీల మిళితంతో హౌస్‌లో సరికొత్త డైనమిక్స్ కనిపించనున్నాయి. తాజాగా లాంచ్ ప్రోమో విడుదల చేశారు. దాదాపు 2 నిమిషాల 29 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో చాలా మంది కంటెస్టెంట్లను సగం మాత్రమే చూపించారు. ‘ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9′ అని నాగార్జున వాయిస్‌తో ప్రోమో మొదలు కాగా, నాగార్జున్ లుక్, స్టైల్, స్వాగ్ అదిరిపోయింది అని చెప్పాలి.
ప్రోమోలో ఓ వ్యక్తి సూట్ కేసు పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటాడ. అతను జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ అని అర్ధమవుతంది. బిగ్ బాస్ సీజన్ 9 ఇందు వదన, సుందర వదనా వావ్’ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్లాంగ్ లో చెప్పడం చూస్తే కచ్చితంగా ఇమ్మాన్యుయేలే అని అర్థమై పోతుంది. ఇక ‘పిక్చర్ అబీ బాకీ హై’ అని లక్స్ పాప, హీరోయిన్ ఆశా శైనీ అంటుంది. ఇక హకీ స్టిక్ తో కనిపించినది సీరియల్ నటుడు భరణి అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఓ మేల్ కంటెస్టెంట్ చిన్న బాక్స్ పట్టుకుని బిగ్ బాస్ వేదిక పైకి వస్తాడు. ‘బాక్స్‌ను తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందా’ అని నాగార్జున అడగగా, అప్పుడు నాగ్ బిగ్ బాస్‌ని అడుగుతాడు. బిగ్ బాస్ అందుకు అనుమతి లేదని అంటాడు. అది నా బాడీలో ఓ భాగం. దయచేసి లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వండి’ అని బిగ్ బాస్‌తో చెప్పిన కూడా అందుకు పర్మీషన్ ఇవ్వకపోవడంతో తాను ఇంటికి వెళ్లిపోతాడు. దాంతో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకుండానే బయటకు వెళ్లినట్టు అర్ధమైంది. మొత్తానికి ప్రోమో భారీ అంచనాలు పెంచింది.