Adi Reddy | బుల్లితెరపై హైయెస్ట్ టీఆర్పీలు కొల్లగొట్టే రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 (ఆదివారం) సాయంత్రం గ్రాండ్ లాంచ్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 9’ ప్రారంభం కానుంది. ఇప్పటికే హౌస్, హోస్ట్, హంగామా అన్నీ సిద్ధం కాగా.. ఓపెనింగ్ ఎపిసోడ్‌కు ఘాటీ సినీ సెలబ్రిటీలు కూడా హాజరవుతారని సమాచారం. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అనుష్క ప్రత్యేక అతిథిగా షోలో సందడి చేసే అవకాశముంది. ఇప్పటి వరకూ నిర్వాహకులు అధికారికంగా కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించకపోయినా, సోషల్ మీడియాలో అనేక గాసిప్‌లు హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన ఆది రెడ్డి ఒక వీడియోలో ఈ సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్‌ను లీక్ చేశాడు. గత సీజన్లలో కూడా అతని అంచనాలు నిజమవ్వడం విశేషం. అందుకే ఈసారి కూడా అతను చెప్పిన పేర్ల పైన ఆసక్తి పెరిగింది. ఆది రెడ్డి లీక్ చేసిన సెలబ్రిటీ కంటెస్టెంట్లు చూస్తే..
రీతూ చౌదరి (జబర్దస్త్ ఫేమ్)
ఇమ్మాన్యుయేల్ (కమెడియన్)
రాను బొంబాయి కి రాను ఫేమ్ రాము రాథోడ్
తనూజా గౌడ (సీరియల్ నటి)
ఆశా షైనీ (లక్స్ పాప)
భరణి శంకర్ (సీరియల్ విలన్)
సుమన్ శెట్టి (నటుడు)
శ్రష్టి వర్మ (కొరియోగ్రాఫర్)
సంజనా గల్రానీ (నటి)
కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వీరేనా?
ఈసారి కూడా కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఐదు లేదా ఆరుగురిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆది రెడ్డి తెలిపిన వారి వివరాల ప్రకారం:
మాస్క్ మ్యాన్ హరీశ్
మర్యాద మనీశ్
శ్రీజ
ఆర్మీ పవన్ కళ్యాణ్
ప్రియా
పవన్
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా రెడీ..
ప్రతి సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయంటున్నారు. షో ప్రారంభమైన రెండు వారాల తర్వాత, లేదా దీపావళి పండగ సమయానికి కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉండగా, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓపెనింగ్ షోలో వినోదం, డ్యాన్స్, సందడితో ప్రేక్షకులకు పండగ వాతావరణం రానుంది. మరి ఆది రెడ్డి చెప్పిన లిస్ట్ నిజమేనా? లేదా కొత్త సర్ప్రైజ్లు ఉంటాయా అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.