Devi Sri Prasad |పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం కూడా భారీ హిట్ అవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ జాక్సన్ లుక్‌లో కనిపించిన పవన్.. మళ్లీ డ్యాన్స్ మూడ్‌లోకి వచ్చారనే సంకేతాలు అందజేశారు. దీనిపై తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సైమా అవార్డ్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..‘‘సినిమా సూపర్‌గా వస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారిపై ఓ సాంగ్ షూట్ చేశాం. ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. షూటింగ్ తర్వాత ఆయన నన్ను చూసి, ‘అదరకొట్టేశావు దేవీ! చాలా కాలం తర్వాత మళ్లీ డ్యాన్స్ చేయాలనే కోరిక కలిగించావు. నాతో డ్యాన్స్ చేయిస్తున్నావ్ నువ్వు’ అన్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు నా మనసు గాల్లో తేలిపోయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ హైలైట్ అవుతుంది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా మాస్, క్లాస్ అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉందని, పక్కా ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది అన్నారు.
శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, ఎల్బీ శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, రాంకీ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. 13 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, మ్యూజిక్ అప్డేట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు పెంచుతున్నాయి. సంక్రాంతి సీజన్‌కి ఈ సినిమా విడుదల కావొచ్చన్న టాక్ ఉన్నప్పటికీ, అధికారిక విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.