తిరుపతి : తిరుపతి ( Tirupati )లోని 4 ప్రాంతాలను ఆర్డీఎక్స్ పేలుడు(RDX explosives) పదార్థాలతో పేల్చబోతున్నట్లు రెండు అనుమానస్పద ఈ మెయిల్ బెదిరింపులు ( Email threats) రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలతో బాంబు నిర్వీర్య బృందాల శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమల వైకుంఠం 1, 2లో, అలిపిరి తనిఖీ కేంద్రంవ ద్ద క్షుణ్నంగా పరిశీలన అనంతరం తిరుమలకు అనుమతించారు.
తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాలు, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తనిఖీలు చేపట్టారు. ఈనెల 6న తిరుపతిలో సీఎం పర్యటన దృష్ట్యా వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే తిరువళ్లూరు కేంద్రంగా ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కుట్రగా మెయిల్ బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.