న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రూ.109.98 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.
కంపెనీలో 63.17 శాతం వాటా కలిగివున్న కేంద్రానికి ఈ డివిడెండ్‌కు సంబంధించిన చెక్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమార స్వామికి భెల్ సీఎండీ కే సదాశివ్ మూర్తి సోమవారం అందచేశారు. మొత్తంగా సంస్థ రూ.174.10 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.