సుల్తాన్‌బజార్, డిసెంబర్ 15: సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ భారతీయ హజ్ గ్రూప్ ఆపరేటర్లకు.. ప్రైవేట టూర్ ఆపరేటర్లకు మార్గదర్శకాలను విడుదల చేసింది. హజ్ యాత్రికులు 2026 జనవరి 15 నాటికి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని హజ్ గ్రూప్ ఆపరేటర్ల అసోసియేషన్ తెలంగాణ ప్రతినిధులు తెలిపారు.
సోమవారం అధ్యక్షుడు హాజీ మహమ్మద్ అబ్దుల్ రజాక్ ఖమర్, జనరల్ సెక్రటరీ జనాబ్ ముహమ్మద్ సిరాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాత్రికులు గుర్తింపు పొందిన.. ఆమోదించబడిన హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలన్నారు. వీసా జారీకి మార్చి 20 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రికులకు హెల్త్ ఫిట్నెస్ తప్పనిసరని, మెడికల్ సర్టిఫికెట్‌పై హజ్ మెడికల్ మిషన్ అధికారుల ఆమోదం ఉండాలని తెలిపారు.