హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఐటీ, డిఫెన్స్, ఫార్మా వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ పార్లమెంట్ బృందానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. జర్మనీ-భారత్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతున్నదని, ఇది రాబోయే రోజుల్లో మరింత బలపడి ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.
ప్రజాభవన్‌లో శుక్రవారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జర్మనీ బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టిన జర్మనీ సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.