వడ్డేపల్లి, జూలై 14 : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్లో విద్యుత్తు సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి మంగళవారం భట్టి హాజరయ్యారు. సభ లో ఆయన మాట్లాడుతుండగానే మాజీ సర్పంచ్ కళావతి మహరాజ్ తన ఆవేదన వెళ్లగక్కేందుకు యత్నించింది. దీంతో కాంగ్రెస్ నేత, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ఎనుముల నాగరాజు వేదికపై నుంచి ఆమె వద్దకు వెళ్లగా తన సమస్య ను వివరించింది.
‘భట్టి సారూ.. మీరు ప్రారంభించిన సబ్‌స్టేషన్ గది, సబ్‌స్టేషన్ చుట్టూ గ్రిల్స్ నిర్మాణం.. మట్టి కొట్టించానని వాటి బిల్లులు రాలేదని.. వాటి సం గతి తేల్చండి’ అని డిమాండ్ చేసింది. గ్రామంలోని బడి ప్రహరీ, సీసీ రోడ్లు వేయించిన తన భర్త మృతి చెందాడని.. రూ.70లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాపోయింది. సమస్యను మాజీ ఎమ్మెల్యే సంపత్ దృష్టికి తీసుకెళ్తానని సదరు నేత హామీ ఇచ్చారు. ఇదే సభకు హాజరైన మహిళలు తాగునీరు వస్తలేదని కేకలు వేయగా వారిని సముదాయించారు.