హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాలకు తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా గన్నవరపు వెంకట భాస్కర్‌రావు ఎన్నికయ్యారు. బుధవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా రెండేళ్లు స్వామివారి తరపున సేవలు అందించిన భాస్కర్‌రావును తిరిగి లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా నియమించినట్టు చెప్పారు. భాస్కర్‌రావు.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జిల్లాలు, ప్రధాన పట్టణాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేలా, ధర్మప్రచార పరిషత్‌లో చేపట్టిన గోసంరక్షణ కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి దేవాలయంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి కోరారు.