పర్ణశాల, సెప్టెంబర్ 7: తక్కువ జీతానికే గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని, జీతాలు ప్రతి నెలా
రావడం లేదంటూ భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్ధి కేంద్రం కార్మికులు ఆదివారం సమ్మెబాట పట్టారు. 3నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాగునీటి శుద్ధి కేంద్రం వద్ద కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న కార్మికులు తాజాగా సమ్మెబాట పట్టారు.