వరంగల్, మే 1: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ అలయంలో మంగళవారం నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3న అంకురార్పణ, 4న ధ్వజారోహణం, 5న ఎదుర్కోళ్లు జరుగుతాయని వివరించారు. 6వ తేదీ సాయంత్రం 7 గంటలకు కల్యాణ మహోత్సవం, 10న సాయంత్రం 7 గంటలకు రథోత్సవం, 14న చక్రస్నానం, పుష్పయాగంతో బ్రహోత్సవాలు ముగుస్తాయని వారు పేర్కొన్నారు.