ఆదిలాబాద్ : పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ. 38 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి ఆయన సోమవారం భూమి పూజ చేశారు.
జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం, సాయుధ దళ కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం సాంకేతిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నట్లు తెలిపారు.
శాంతి భద్రతలను కాపాడుతూ పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు దేశంలో మంచి పేరు ఉందని మంత్రి పేర్కొన్నారు.