కంపెనీ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన డమ్మీ కారు కాదు ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్యూవీ. హమ్మర్ సంస్థ దీన్ని తయారు చేసింది. పొడవు 14 మీటర్లు. వెడల్పు 6 మీటర్లు. ఎత్తు 6.6 మీటర్లు. ఇందులోనే కిచెన్, బాత్రూం, బెడ్ రూమ్ ఉన్నాయి. ఈ కారులో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. దుబాయ్ యువరాజు షేక్ అల్ నహ్యాన్ ఈ కారును కొనుగోలు చేశారు. అయితే ధర మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం యూఏఈలోని ఓ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.