కొందరిలో ముక్కుమీద ‘బ్లాక్ హెడ్స్’ ఎక్కువగా ఉంటాయి. ముఖం ఎంత కాంతిమంతంగా ఉన్నా, అందాన్ని ఇవే ‘బ్లాక్’ చేస్తుంటాయి. అందుకే, వీటిని తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. కొన్ని చిట్కాలతో బ్లాక్ హెడ్స్‌ను పూర్తిగా బ్లాక్ చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మరసం : చర్మ రంధ్రాలను నిమ్మరసం బిగుతుగా మారుస్తుంది. గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి.. బ్లాక్‌హెడ్స్‌పై అప్లయి చేయండి. పది నిమిషాల తర్వాత మెత్తటి టవల్‌తో తుడిచేయండి. బ్లాక్‌హెడ్స్ ఇట్టే మాయమైపోతాయి.
కలబంద: బ్లాక్ హెడ్స్‌ను నిర్మూలించడంలో కలబంద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది! కలబంద గుజ్జును తీసుకొని.. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంపై సున్నితంగా రాయాలి. 10-15 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఆవిరి: ముఖానికి ఆవిరిపట్టడం ద్వారా.. బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. ఆవిరి వల్ల చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. దాంతో బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. ముఖం కాంతిమంతంగా మారుతుంది.
ఓట్మీల్ మాస్క్: నీటిలో కొద్దిగా ఓట్‌మీల్‌ను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మాస్క్‌ను బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నచోట అప్లయి చేసి.. 15 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో, అదనపు నూనెలను గ్రహించడంలో ఓట్మీల్ సమర్థంగా పనిచేస్తుంది.
తేనె, దాల్చిన చెక్క మాస్క్: బ్లాక్ హెడ్స్ మరీ ఎక్కువగా ఉంటే.. తేనె, దాల్చినచెక్కను ఆశ్రయించాలి. ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కుపైన మాస్క్‌లా అప్లయి చేస్తే.. లోతుగా పాతుకుపోయిన బ్లాక్ హెడ్స్ ఇట్టే బయటికి వచ్చేస్తాయి.