హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ (బీసీఎస్).. సోమవారం నాలుగు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో బ్లూహెల్త్ యాప్, బ్లూరా, ఎడ్యు జెనీ, బయోస్టర్ ఉన్నాయి. ఈ వినూత్న ఉత్పత్తులను హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ రంగంలోనూ కొత్త ఆవిషరణలకు ఉత్ప్రేరకంగా ఏఐ నిలుస్తున్నదని, ఆరోగ్య సంరక్షణలో ఏఐ అంటే జీవితాలను మార్చగలిగిన శక్తి అన్నారు. ప్రభుత్వ మాజీ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, బీసీఎస్ చైర్పర్సన్ జానకి యార్లగడ్డలు పాల్గొన్నారు.