BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
BCCI : ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అనే సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ సహా ప్రపంచ దేశాలకు చెందిన క్రికెట్ బోర్డుల విలువను ప్రముఖ సంస్త బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది.
BCCI : ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అనే సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ సహా ప్రపంచ దేశాలకు చెందిన క్రికెట్ బోర్డుల విలువను ప్రముఖ సంస్త బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. దీని ప్రకారం భారత క్రికెట్‌ను నడిపించే అధికారిక సంస్థ బీసీసీఐ (ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ విలువ 2.2 బిలియన్ డాలర్లు అని బిజినెస్ స్టాండర్డ్ సంస్థ అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20,000 కోట్లకుపైమాటే.
క్రికెట్లో అత్యంత విలువైన, సంపద కలిగిన టాప్ 10 దేశాల క్రికెట్ బోర్డుల జాబితాను ఈ సంస్థ ప్రచురించింది. ఇందులో బీసీసీఐ టాప్‌లో ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో అంటే, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన బోర్డుల సంపద మొత్తం కంటే బీసీసీఐ విలువే ఎక్కువ కావడం గమనార్హం. అది కూడా తర్వాతి మూడు స్థానాల్లో ఉన్న బోర్డుల కంటే బీసీసీఐ విలువ 11 రెట్లు ఎక్కువ. బీసీసీఐ తర్వాత 79 మిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), 59 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), 55 మిలియన్ డాలర్లతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాలుగో స్థానంలో ఉంది.
ఈ మూడింటి విలువ మొత్తం 193 మిలియన్ డాలర్లుగా ఉంటే.. బీసీసీఐ విలువ 2.2 బిలియన్ డాలర్లు. అంటే, కనీసం రెండు బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది. జాబితాలో 51 మిలియన్ డాలర్లతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐదో స్థానంలో, 47 మిలియన్ డాలర్లతో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) ఆరో స్థానంలో, 38 మిలియన్ డాలర్లతో జింబాబ్వే క్రికెట్ ఏడో స్థానంలో, 20 మిలియన్ డాలర్లతో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎనిమిదో స్థానంలో, 15 మిలియన్ డాలర్లతో వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ తొమ్మిదో స్థానంలో, 9 మిలియన్ డాలర్లతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) పదో స్థానంలో నిలిచాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

