పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఛాయా సోమేశ్వరాలయాన్ని...
రామగిరి, అక్టోబర్ 23 : పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఛాయా సోమేశ్వరాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయిలో ఎక్కడ లేని విధంగా “వందల ఏళ్ల క్రితమే శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాన్ని సమన్వయం చేసి శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి, ప్రాచీన నిర్మాణ విజ్ఞానానికి అద్భుత నిదర్శనమన్నారు.

పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వాన్ని కాపాడటంతో పాటు మరింత పర్యాటక ప్రాధాన్యత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మంత్రి చొరవతో ఆలయ అభివృద్ధి నిధులు విడుదల కావటంలో భక్తులు,స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

