రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీఆర్వో పద్మావతి ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
– పది నెలల్లో 191 మంది మృతి.. 409 మందికి గాయాలు
చుంచుపల్లి, అక్టోబర్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డీఆర్వో పద్మావతి ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ ఏడాది జనవరి 1 నుండి అక్టోబర్ 15 వరకు జిల్లాలో 410 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 191 మంది మృతి చెందారని, 409 మంది గాయపడ్డారని తెలిపారు. జాతీయ రహదారులపై అత్యధికంగా 75 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అక్టోబర్ మొదటి 15 రోజుల్లోనే 21 ప్రమాదాలు జరిగి 10 మంది మృతి చెందగా, జిల్లాలో మొత్తం 8 హిట్ అండ్ రన్ కేసులు నమోదైనట్లు వివరించారు.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర మలుపులు, కూడళ్ల వద్ద సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్నారు. వాహనదారులకు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించడంతోపాటు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడంపై కఠిన నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీటీఓ భూషిత్ రెడ్డి, డీఆర్ఎం జి. బాలాజీ, డీఐఈఓ సీహెచ్. వెంకటేశ్వర్లు, డీఎస్పీ వెంకన్న బాబు, ఆర్అండ్బీ ఈఈ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

