ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
మహాత్మాగాంధీ యూనివర్సిటీ –నల్లగొండతో పాటు ప్రస్తుతం తెలంగాణలో వివిధ యూనివర్సిటీలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు అమలులో ఉన్న నూతన ఇంగ్లీష్ సిలబస్‌కు అనుగుణంగా ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ హెచ్‌వోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.అరుణప్రియ సంపాదకత్వంలో..
– వర్సిటీలో ఆవిష్కరించిన వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, అక్టోబర్ 23 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ –నల్లగొండతో పాటు ప్రస్తుతం తెలంగాణలో వివిధ యూనివర్సిటీలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు అమలులో ఉన్న నూతన ఇంగ్లీష్ సిలబస్‌కు అనుగుణంగా ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ హెచ్‌వోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.అరుణప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘ఇంగ్లిష్ ఫర్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్’ నూతన ఆంగ్ల పాఠ్య పుస్తకాన్ని ప్రథమ సంవత్సరం సెమిస్టర్ -1 అండ్ 2 తో పాఠ్య పుస్తకం రూపొందించారు. పుస్తకాన్ని వర్సిటీలోని తన చాంబర్లో పుస్తక సంపాదకులు డా.అరుణప్రియ, రిజిస్ర్టార్ కొప్పుల అంజిరెడ్డితో కలిసి వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల సీనియర్ అద్యాపకులు, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.రహాత్ ఖానం, ఇతర రచయితలు బి.లీలారాణి, లెఫ్టినెంట్ సీహెచ్.సుధాకర్ పాల్గొన్నారు.

ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
విద్యార్దులకు ఎంతో ఉపయుక్తం : డా.అరుణప్రియ, పాఠ్య పుస్తక రచయిత
విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించేలా తీర్చిదిద్దిన ఈ నూతన పాఠ్య పుస్తకం డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సిలబస్ ప్రకారం మార్కెట్లో ఎలాంటి మెటిరియల్ లభించక విద్యార్దులు ఇబ్బంది పడుతారు. ఆ ఇబ్బందులు రాకుడదనే సీనియర్ ఆంగ్ల అధ్యాపకులు రాహత్ ఖానం, లీలారాణి, సుధాకర్ సహాకారంతో పుస్తకాన్ని రూపొందించాం. అదే విధంగా నిపుణులు సహితం హర్షం వ్యక్తం చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

