న్యూఢిల్లీ: భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఇకపై మాస్టర్‌కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగిసిందని, ఇక మాస్టర్‌కార్డ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని సోమవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మన దేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, మహిళా క్రికెట్ మ్యాచ్‌లకు మాస్టర్ కార్డ్ స్పాన్సర్‌గా ఉంటుందని తెలిపారు.