
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫూలే-అంబేద్కర్ ఆలోచనా సమితి (పాస్), తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28తేదీల్లో రాష్ట్ర స్థాయిలో బీసీ యువజన సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎంఏ మాలిక్, డాక్టర్ తలారి సత్యం, తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నందకుమార్, డాక్టర్ బాలశ్రీనివాస్ తెలిపారు. తార్నాకలో రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రాచీన భారతదేశం నుంచి ప్రస్తుత తరుణంలో బీసీలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రస్తానంపై ప్రముఖులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ అంశాలపై విశ్రాంత ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ సింహాద్రి, వీజీఆర్ నారగోని, సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ ఎ.పున్నయ్య, డాక్టర్ బీనవేని రామ్, స్కైబాబా, మహతి రమేశ్, ఎస్.హిమబింధు ప్రసంగిస్తారని వెల్లడించారు.