Ketan Murder Case | కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నాలుగు నెలల క్రితమే సియా, చేతన్ వివాహం..!
Ketan Murder Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె బిజినెస్‌మ్యాన్ (Pune Business Man) కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో నిందితురాలు సియా (Sia), ఆమె ప్రియుడు చేతన్ (Chetan) ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దాంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
Ketan Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె బిజినెస్‌మ్యాన్ (Pune Business Man) కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో నిందితురాలు సియా (Sia), ఆమె ప్రియుడు చేతన్ (Chetan) ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దాంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబరులో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేని సియా (Siya).. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాలుగు నెలల కిందటే పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రియుడు చేతన్‌ను పెళ్లి చేసుకుందట. దీనికి ఇద్దరు స్నేహితులు సాక్షి సంతకాలు చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా సియా, చేతన్ ఫోన్లలోని వాట్సప్ సంభాషణలను పరిశీలించడంతో ఈ విషయం బయటపడినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
దాంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి వివాహ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందా అనేది వెరిఫై చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ పెళ్లి ఫొటోలను సియా తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందట. అయితే ఆ తర్వాత వాటిని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక బృందాల సాయంతో ఆ ఫొటోలను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జూన్ 18న కేతన్ అగర్వాల్ లోయలోపడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పుణెలోని చారిత్రక లోహగఢ్ కోట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పోలీసులు భావించగా ఆ తర్వాత దాన్ని హత్యగా తేల్చారు. ప్రియుడితో కలిసి సియానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

