Kylian Mbappe : ఫిఫా వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) వివాదంలో చిక్కుకున్నాడు. సోషల్ మీడియా పోస్ట్‌తో తనను అవమానించిన ఫ్రాన్స్ కెప్టెన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పరాగ్వే సెనేటర్(Senator) డిమాండ్ చేశారు. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశ సెనేటర్ సెలెస్టే అమరిల్లా (Seleste Amarilla)ను ఉద్దేశించి ‘నీచమైన మహిళ’ అని ఎంబాపే కామెంట్ చేశాడు. అతడి వ్యాఖ్యలు జాతి వివక్షపూరితంగా ఉన్నాయని మండిపడిన సెలెస్టే బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించారు.
వరల్డ్‌కప్‌లో 16వ రౌండ్లో ఫ్రాన్స్, పరాగ్వే తలపడ్డాయి. మ్యాచ్‌లో ఎంబాపే బృందం విజయంతో ప్రీ-క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్ పూర్తయ్యాక ఎంబాపే ఎక్స్‌లో సెలిస్టే అమరిల్లాను నీచమైన మహిళగా పేర్కొంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన సెలెస్టీ కోపంతో ఉగిపోయింది. తనను నీచమైన మహిళ అనేందుకు, సెనెటర్ పదవికి అనర్హురాలు అనడానికి ఎంబాపే ఎవరు? అని ఆమె ప్రశ్నించారు.
🚨 Celeste Amarilla (Paraguayan senator), on Kylian Mbappé: “This brute hasn’t even learned to write. Instead of breastmilk, he grew up sucking on coconuts, and the most educated creatures he ever heard were chimpanzees.
You should’ve given him the middle finger, Orlando Gill… pic.twitter.com/cUBeXln4l1
— Madrid Zone (@theMadridZone) July 6, 2026
‘సమస్య నీకు, నాకు మధ్య. ఫ్రాన్స్‌ను ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. నేను ఫ్రాన్స్‌లోని స్కూల్లో చదివాను. పదిహేడేళ్లు వచ్చేవరకూ ఇక్కడే చదివా. ఫ్రెంచ్ మాట్లాడుతా. ఫ్రాన్స్ రావడం అంటే నాకు ఇష్టం. నాకు ఫ్రాన్స్‌తో ఏ సమస్యా లేదు. నీతోనే సమస్య. మ్యాచ్ అనంతరం ఎంబాపే తన కోపాన్ని, ధిక్కార స్వభావాన్ని చూపాడు. పరాగ్వే ఆటగాళ్లు, గోల్ కీపర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు నా దేశాన్ని గాయపరిచింది. కాబట్టి ఎంబాపే తన పోస్ట్ పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని సెలెస్టీ పేర్కొంది.
🚨 SENATOR OF PARAGUAY, CELESTE SINEZOR OPEN LETTER TO KYLIAN MBAPPÉ:
The problem is between you and me. I have never said anything against France. On the contrary, I stand with France. I studied at a French school from the age of 2 until I was 17, where I completed my… pic.twitter.com/KMCTbmYVjN
— Madrid Zone (@theMadridZone) July 7, 2026
పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఎంబాపే ఎక్స్ పోస్ట్‌లో సెలెస్టీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘ మేడం సెలెస్టీ.. మీరు ఒక నీచమైన మహిళ. సెనేటర్ పదవికి మీరు అనర్హులు. మీరు పరాగ్వే ప్రతినిధులు కారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పరాగ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో మీ నిర్లక్ష్య ధోరణిని, మీరు చూపిన జాతి వివక్షను అందరూ మరిచిపోయారు. మీరు అశక్తులు. దేశ ప్రతినిధిగా మిమ్మల్ని చూపడానికి అనర్హులు. విద్వేషాన్ని, జాతివివక్షను ప్రపంచమంతా వ్యాపింప జేయాలనుకునే ఆమెలాంటి వాళ్లను నేను అనుమతించను’ అని ఎంబాపే తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు.
Madame Celeste Amarilla,
Vous êtes une femme méprisable et indigne de sa fonction.
Vous ne représentez pas le Paraguay, ce pays qui a transpiré la passion et l’honneur tout au long de la compétition. Par votre inconscience et votre racisme décomplexé, le monde entier a déjà… pic.twitter.com/EnYmgQXvPL— Kylian Mbappé (@KMbappe) July 6, 2026