జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి.. కేంద్ర మంత్రి అథవాలేకు బీసీ సంఘాల వినతి
కేంద్రం నిర్వహించతలపెట్టిన జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చేందుకు చొరవ చూపాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలేను బీసీ సంఘాలు కోరాయి.
హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ) : కేంద్రం నిర్వహించతలపెట్టిన జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చేందుకు చొరవ చూపాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలేను బీసీ సంఘాలు కోరాయి. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశాయి. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించినా, ఆ లెకల సేకరణకు స్పష్టమైన విధానం లేదని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల తరహాలో ఓబీసీ కాలమ్ చేర్చితేనే బీసీ కులాల లెక తేలుతుందని, శాస్త్రీయత ఉంటుందని స్పష్టంచేశారు. బీసీ సంఘాల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చినట్టు ఓబీసీ నేతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తాటికొండ విక్రమ్‌గౌడ్, కనకాల శ్యామ్, కులచర్ల శ్రీనివాస్, మహేశ్‌యాదవ్, నరసింహనాయక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

