అమ్మాయి మనసు కోణంలో సాగే కథ
‘క్రేజీ కల్యాణం’ తెలంగాణ నేపథ్య చిత్రం. కానీ అన్ని ప్రాంతాలవారికీ నచ్చేలా, మనసులను హత్తుకునేలా సినిమా ఉంటుంది’ అని దర్శకుడు బద్రప్ప గాజుల అన్నారు.
ఆయన దర్శకత్వంలో.. నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మించిన ఈచిత్రం ఈ నెల 16న విడుదల కానున్నది. ఈ సందర్భంగా దర్శకుడు బద్రప్ప గాజుల శనివారం హైదరాబాద్‌లో విలేక మాట్లాడారు. ‘మాది తెలంగాణ, మేడ్చల్ దగ్గర బండమైలారం. కళాకారుల కుటుంబం కావడంతో ఆటోమేటిగ్గా ఆ కళలన్నీ నాకూ సంక్రమించాయి.
సహాయ దర్శకునిగా నేనెక్కడా పనిచేయలేదు. అయినా.. ప్రభుత్వ పథకాలకు చెందిన 200లకు పైగా వీడియోస్ చేశాను. సినిమా అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. చెప్పాలనుకున్న కథలన్నీ వెండితెర ద్వారానే చెప్పాలనుకున్నా. అమ్మాయిలకు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు ఉంటాయని, కానీ అవేమీ పట్టించుకోకుండా బలవంతంగా పెళ్లిళ్లు చేసే విషసంస్కృతిని ప్రశ్నిస్తూ రాసుకున్న కథ ఇది. అనుపమ పరమేశ్వరన్‌కి ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారు. అక్క, చెల్లి, అమ్మ, నాన్నమ్మ.. ఇలా కుటుంబంలోని మహిళల మధ్య పెరిగిన అమ్మాయి మనసు కోణంలో ఈ కథ సాగుతుంది’ అని బద్రప్ప గాజుల పేర్కొన్నారు.
ఇది భావోద్వేగాల ప్రయాణమని, ఈసినిమా చూస్తున్న ప్రేక్షకులకు తమ ఇండ్లలో పెళ్లి జరగుతున్న ఫీలింగ్ కలుగుతుందని, తరుణ్‌భాస్కర్ చేసిన ప్రత్యేకపాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది, సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని బద్రప్ప గాజుల చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

