కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిర్వహించిన సమావేశానికి కరెంటు కటకట ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని అనేకచోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు, సబ్స్టేషన్ల ముట్టడి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి సాక్షాత్తూ కాంగ్రెస్ మీటింగ్‌కే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని పార్టీ శ్రేణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
- మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా అంతరాయం
- కొద్ది నిమిషాలకే కరెంటు రావడంతో కొనసాగిన ప్రసంగం
- వేదికపై విద్యుత్తు శాఖ మంత్రి భట్టి ఉండగానే కరెంటు కట్ సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణుల్లో విద్యుత్తు కోతలపై అసహనం
ఖమ్మం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిర్వహించిన సమావేశానికి కరెంటు కటకట ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని అనేకచోట్ల ఆందోళనలు, రాస్తారోకోలు, సబ్స్టేషన్ల ముట్టడి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి సాక్షాత్తూ కాంగ్రెస్ మీటింగ్‌కే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని పార్టీ శ్రేణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వేదికపై సాక్షాత్తు విద్యుత్తు శాఖ మంత్రి మల్లు విక్రమార్క ఉండగా.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రసంగిస్తుండగానే ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణుల్లో ఇవేమి కరెంటు కోతలంటూ తీవ్ర అసహనం వ్యక్తమైంది. కొద్ది నిమిషాలకు కరెంట్ రావడంతో పొంగులేటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

