హుజూరాబాద్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. దొంగ బీజేపీ ఉయ్యాలో.. గ్యాస్ ధరలను పెంచి ఉయ్యాలో… మమ్మల్ని ఆగం చేస్తుంది ఉయ్యాలో. పెట్రోల్ ధరలను పెంచి ఉయ్యాలో… సామాన్యుల నడ్డీవిరుస్తుంది ఉయ్యాలో.. నూనె ధరలను చూస్తే ఉయ్యాలో… ఆకాశాన్నింటుతున్నయ్ ఉయ్యాలో. .వచ్చే ఎన్నికల్లో ఉయ్యాలో… బీజేపీకి ఓటేయ్యం ఉయ్యాలో… అంటూ మహిళలు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
నిత్యం పెంచుతున్న ధరలను చూసి కడుపు మండిన మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ సాక్షిగా బీజేపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. హుజూరాబాద్ పట్టణంలోని 18వ వార్డులో గల ప్రతాపవాడలో శివాలయం దగ్గర గ్యాస్ సిలిండర్లపై బతుకమ్మలను పెట్టి బీజేపీ ప్రభుత్వంలో పెరుగుతున్న నిత్యవసర ధరలపై బతుకమ్మ పాట రూపంలో పాడి తమ నిరసన వ్యక్తం చేశారు.