జగిత్యాల : బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి అన్నారు. మాజీ ఎన్ఎస్యూఐ లీడర్ జగిత్యాల పట్టణ కురుమ సంఘం ఉపాధ్యక్షుడు మహేష్ తన మిత్రులతో కలిసి జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులను నీరుగార్చిందన్నారు. గతంలో కేసీఆర్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను ప్రజానీకానికి చేరవేయడం మన బాధ్యతగా ముందుకు పోవాలని సూచించారు. బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు నిజమైన గుర్తింపు లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.