Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Global Telangana Association | పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 19 : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ, దసరా వేడుకల్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి- పుష్పలత దంపతులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిట్టేటి రామ్ రెడ్డి-లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాగ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు.
.
అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దసరా పండుగలను విదేశాల్లో సైతం ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం సాగిన పోరాటంలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ఆ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ మాతృభూమి సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ, బతుకమ్మ, దసరా వంటి పండుగలను భావితరాలకు పరిచయం చేయడం ద్వారా తెలంగాణ మూలాలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి, ఐక్యతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ కల్వల విశ్వేశ్వర్, కార్యవర్గ సభ్యులు, అమెరికాలో నివసిస్తున్న తెలంగాణవాసులు తదితరులు పాల్గొన్నారు.

Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

