పర్యావరణ దీపం!
నాకు బతుకమ్మ పెత్తరమాసతో కాదు, బొడ్డెమ్మతోనే మొదలవుతుంది! బతుకమ్మకు మొదటి అడుగు బొడ్డెమ్మ!
నాకు బతుకమ్మ పెత్తరమాసతో కాదు, బొడ్డెమ్మతోనే మొదలవుతుంది!
బతుకమ్మకు మొదటి అడుగు బొడ్డెమ్మ!
బొడ్డెమ్మను అనుసరించిన తర్వాతి అడుగు బతుకమ్మ!
పుట్టమన్నుతో చేసిన పీట బొడ్డెమ్మ
బావి మట్టితో కూర్చిన బావి బొడ్డెమ్మ
సీతాఫలం ఆకులతో పేర్చిన పందిరి బొడ్డెమ్మ
మనిషి తొక్కని మట్టితో చేసిన గుంటబొడ్డెమ్మ
పూల పండుగలో నా మట్టి ముచ్చట్లు ఇవి!
బొడ్డెమ్మ పైన పెట్టిన వెంపలి చెట్టు
గౌరమ్మకు పెట్టిన కుంకుమ బొట్టు
ముత్తైదులకు పంచిన వాయనం మూట
నవరాత్రుల్లో కట్టిన గొల్లభామ లంగా
మట్టి పండుగలో నా చెరువు సంగతులు ఇవి!
సబ్బండ వర్ణాలకు పంచిన మలీద ముద్దలు
చేపలకు వేసిన సద్దుల ఆహారం
పక్షులకు చల్లిన అటుకుల ఫలహారం
ఎడ్ల పండుగలో మెరిసిన జీవకారుణ్యం
చెరువుల పండుగలో నా పాటల చప్పట్లు ఇవి!
రంగురంగుల అడవి పూలను
చుట్టుకున్న చెల్కల బంగారం
ఊరేగే పూలతోటలా ఊళ్లసింగారం
తూగాడే పూలఏరులా చెరువుల పరవశం
ఆత్మీయతతో పంచుకునే సద్దుల ఆహారం
పాటల పండుగలో నా నాట్య విలాసం ఇది!
బతుకమ్మంటే ఆశ్రమ ధర్మాలను
గుర్తు చేసే జీవన సారం!
శ్రమ జన్మలను గుర్తు పట్టే వికాస పాఠం
ఆడబిడ్డల చేతుల్లో ఒదిగిన ప్రకృతి రూపం!
పల్లెగుండెల్లో నిలిచిన పర్యావరణ దీపం!
అయినంపూడి శ్రీలక్ష్మి
9989928562
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

