Pak Vs Ban | రావల్పిండి: పాకిస్థాన్‌తో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (138) అద్భుత శతకానికి తోడు మెహిది హసన్ మిరాజ్ (78) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకదశలో 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లా ఇక్కడిదాకా వచ్చిందంటే అది లిటన్, మిరాజ్ పోరాటమే.
పాకిస్థాన్ యువ పేస్ సంచలనం ఖుర్రం షాజాద్ (6/90) ఆరు వికెట్లతో బంగ్లా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. పర్యాటక జట్టు ఆలౌట్తో 8 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకున్న పాకిస్థాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (3), నైట్ వాచ్మెన్ ఖుర్రంను హసన్ మహ్ముద్ పెవిలియన్‌కు పంపాడు.