న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 258/5
బంగ్లాదేశ్తో మొదటి టెస్టు
మౌంట్మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ బ్యాటర్ కాన్వే (122; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శనివారం ప్రారంభమైన మొదటి టెస్టులో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కాన్వేతో పాటు విల్ యంగ్ (52), రాస్ టేలర్ (31), హెన్రీ నికోల్స్ (32 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టారు.