హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఈ నెల 8న సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పోలీసులకు లేఖ రాశారు. అదేరోజు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా విచారణకు హాజరుకానున్నారు. బండి సంజయ్ సిట్‌కు పలు ఆధారాలు సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.