Bandi Sanjay |హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తనకు అమ్మవారి దయ వల్ల 20 ఏండ్ల నుంచి జ్వరం రాలేదని, కానీ హైదరాబాద్‌లో పాలు తాగిన వెంటనే జ్వరం వచ్చి మూడు రోజులు అడ్డంపడ్డానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో గురువారం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జ్వరం రావడం వల్ల మూడు రోజులపాటు దవాఖాన బెడ్ మీదనే ఉండాల్సి వచ్చిందని వివరించారు. తనకు బీపీ, షుగర్, దగ్గు, దమ్ము లాంటి ఆరోగ్యసమస్యలు లేవని అన్నారు. ప్రస్తుతం అన్నీ కెమికల్స్‌తో నిండిపోయాయని, మార్కెట్లో దొరికే మామిడికాయలు తినాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.