Meenakshi Natarajan | మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కృతి.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
Meenakshi Natarajan | రాజ్యసభకు పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ వేసిన పిటిషన్‌ను ఆమోదించిన సుప్రీం కోర్టు ఆమె వాదనలు వినడానికి అంగీకరించింది.
Meenakshi Natarajan | న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభకు పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ వేసిన పిటిషన్‌ను ఆమోదించిన సుప్రీం కోర్టు ఆమె వాదనలు వినడానికి అంగీకరించింది. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్‌లు ప్రశాంత్ కుమార్ మిశ్రా, అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన పార్షియల్ వర్కింగ్ డే బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను వెల్లడించకుండా అసంపూర్తి అఫిడవిట్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. ఇది ఒక ప్రైవేట్ కేసని, పిటిషనర్‌కు కేవలం సమన్లు మాత్రమే అందాయని, అది రెండేండ్ల లోపు శిక్షపడే కేసుకు సంబంధించినవని ఆయన తెలిపారు. దీంతో కేసును శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

